ఈ రాజస్థాన్ వెల్లుల్లి చెట్ని ట్రై చేయండి టిఫిన్ లోకి సూపర్ గా ఉంటుంది

Velluli Chutney Recipe

మనం మన ఇంట్లో పూరి ఇడ్లీ బజ్జి ఇవే కాకుండా చాలా వెరైటీగా టిఫిన్ అయితే తయారు చేసుకుంటూ ఉంటాం ఇక చట్నీ విషయానికి వస్తే చట్నీ లేకుండా టిఫిన్ చేయలేని పరిస్థితి అయితే కొంతమంది రోజు పల్లి చెట్ని కొబ్బరి చెట్నీ తిని  నోటికి కొత్త రుచి కోసం వెతుకుతూ ఉంటారు అలాంటి వారి కోసం ఈ రాజస్థాన్ వెల్లుల్లి చట్నీ సూపర్‌గా ఉంటుంది.

అంతేకాదు దీనిని ఫ్రిజ్లో పెట్టుకుంటే నాలుగు ఐదు రోజులు నిల్వ ఉంటుంది. ఇలా నిల్వ ఉన్న వెల్లుల్లి చెట్ని మ్యాంగో పికిల్ కన్నా ఇంకా టేస్ట్ ఉంటుంది కానీ దీన్ని నాలుగు నుండి ఐదు రోజులు మాత్రమే నిలువ ఉంచాలి. అంతేగాని దీని ఒక్క టేస్ట్ వాసన చాలా సూపర్ గా ఉంటుంది అయితే ఈ వెల్లుల్లి చట్నీ ఎలా తయారు చేయాలి దానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం.

వెల్లుల్లి రెబ్బలు -20-ఎండు మిరపకాయలు – 7-సాంబార్ ఉల్లిపాయలు – 11-చింతపండు – చిన్న నిమ్మకాయంత-నువ్వుల నూనె- 3 టేబుల్ స్పూన్లు-ఆవాలు – 1 టీస్పూన్-మినపప్పు – 1 టీస్పూన్-శనగపప్పు – 1 టీస్పూన్-కరివేపాకు – రెండు రెమ్మలు-ఉప్పు – రుచికి సరిపడా

కొన్ని వెల్లుల్లి రెబ్బలు మరియు సాంబార్ లో వాడే చిన్ని ఉల్లిపాయలను తీసుకొని వాటికి ఉన్న పొట్టును తీసుకోవాలి  వీటితోపాటు తీసుకున్న ఎండుమిరపకాలను తొడిమలు తీసుకొని ఉంచుకోవాలి.

Click here to earn money by submitting quizzes

తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడిచేయాలి.

అదే పాత్రలో కొద్దిగా ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలను చిన్న ఉల్లిపాయలను వేసి గోల్డ్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్ లో వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లార్చుకోవాలి.

ఇప్పుడు ఒక మిక్సీ జార్‌ లో వేయించిన మిరపకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి, అవసరమైతే కొద్దిగా నీళ్లు చేర్చి మెత్తని పేస్ట్‌ లా రుబ్బుకోవాలి.

ఇప్పుడు తాలింపు కోసం ఒక పాత్రలో నూనె వేసుకుని వేడి చేసుకోవాలి  నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత మినపప్పు, శనగపప్పు వేసి అవి బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి. చివరగా కరివేపాకు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఇలా వేయించిన తాలింపులో ముందుగా మిక్సీ ఆడుకున్న చట్నీని దీనిలో వేసుకుంటే ఎంతో రుచిగా ఉండే రాజస్థాన్ వెల్లుల్లి చెట్ని రెడీ అవుతుంది ఇది టిఫిన్ లోకి సూపర్ కాంబినేషన్ ఉంటుంది

Post Comment

You May Have Missed