×

చెన్నై సూపర్ కింగ్స్ నుండి ఆ స్టార్ ప్లేయర్ అవుట్

చెన్నై సూపర్ కింగ్స్ నుండి ఆ స్టార్ ప్లేయర్ అవుట్

ఐపీఎల్ లో ఐదుసార్లు ఫైనల్ విజేతగా నిలిచిన ప్లే ఆఫ్ అంచుల్లోకి కుడా వెళ్లలేకపోయింది. అందువల్ల జరగబోయే ఐపీఎల్ ఐపీఎల్ 2026 మినీ వేలానికి ఇప్పటి నుంచే చెన్నై సూపర్ కింగ్స్ రెడీ అవుతోంది. ఈ సీజన్‌లో కేవలం 4 విజయాలతో పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచిన సీఎస్‌కే.. వచ్చే సీజన్‌కు జట్టును పునర్మించే పనిలో పడింది. అయితే ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా వ్యవహరించిన రుతురాజు గైక్వాడ్ ప్రారంభంలోనే చేతికి గాయం కారణంగా కెప్టెన్సీ నుండి తప్పుకోవడం జరిగింది దీని తర్వాత ధోని కెప్టెన్సీ బాధ్యతలను తీసుకోగా ఓపెనర్లు మిడిల్ ఆర్డర్లు మంచి స్టార్ట్ ఇవ్వక లేకపోవడం వల్ల చాలా మ్యాచులు లాస్ కావడం జరిగింది. కొన్ని మ్యాచ్లు బౌలర్ల వైఫల్యం వల్ల కూడా ఓడిపోవడం జరిగింది.ఈ నేపథ్యంలో టీమ్‌లో ఉండే ప్లేయర్లు ఎవరు..? రిలీజ్ చేసే ఆటగాళ్లు ఎవరు..?

అనే విషయాల పైన చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ ముందుగానే చర్చలు మొదలుపెట్టింది.రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా టీమ్‌లో కొనసాగనున్నాడు. గైక్వాడ్‌తోపాటు శివం ధుబే, రవీంద్ర జడేజా, మతీషా పతిరనా వంటి స్టార్లను జట్టుతోనే ఉంచుకోనుంది.బౌలింగ్‌లో అదరగొట్టిన నూర్ అహ్మద్, బ్యాటింగ్‌లో దుమ్ములేపిన డెవాల్ట్ బ్రెవిస్, ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్, అంజుల్ కాంబోజ్ వంటి యువ ఆటగాళ్లను కూడా కొనసాగించే అవకాశం ఉంది.వీరితోపాటు ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, వంశీ బేడి, విజయ్ శంకర్, రామకృష్ణ కోషిలు జట్టులో ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు.గత సీజన్‌లో చెత్త ప్రదర్శన చేసిన కొంతమంది ఆటగాళ్లను తొలగించే అవకాశం ఉంది. రవిచంద్రన్ అశ్విన్, రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, సామ్ కుర్రాన్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడాలను చెన్నై విడుదల చేసే అవకాశం ఉంది. వికెట్ కీపర్ కం ఓపెనర్ స్థానం కోసం సంజు సాంసంగ్ తీసుకోవడానికి సీఎస్కే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది అదే జరిగితే చెన్నై సూపర్ కింగ్స్ టీం మరింత స్ట్రాంగ్ గా కనిపించే అవకాశం ఉంది ఈ సీజన్ అయితే యంగ్ స్టార్స్ కి అవకాశాలు ఎక్కువ ఇచ్చే ప్రయత్నాలు బాగానే చేస్తుంది.

Post Comment